'డబ్బులిస్తే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ట్వీట్ చేస్తాం' : బాలీవుడ్ సెలబ్రిటీలు

డబ్బులిస్తే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ట్వీట్ చేస్తాం : బాలీవుడ్ సెలబ్రిటీలు
x
Highlights

తెరముందు నటిస్టే మనీ వస్తుంది అది వైట్ మనీ మరి బ్లాక్ మనీ సంపాదించాలంటే..? ఏం చేయాలి తెర వెనుక కూడా నటించాలి.. విలువలని మర్చిపోవాలి. తనని నమ్మిన...

తెరముందు నటిస్టే మనీ వస్తుంది అది వైట్ మనీ మరి బ్లాక్ మనీ సంపాదించాలంటే..? ఏం చేయాలి తెర వెనుక కూడా నటించాలి.. విలువలని మర్చిపోవాలి. తనని నమ్మిన వారిని మోసం చేయాలి బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది చేస్తున్న పని ఇదే. ప్రముఖ పరిశోధనాత్మక వెబ్ సైట్ కోబ్రాపోస్ట్ బాలీవుడ్ చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చింది డబ్బులు తీసుకొని 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెట్టేందుకు అంగీకరించిన 36 మంది వ్యక్తుల పేర్లను బయట పెట్టింది.

బాలీవుడ్‌లో కొందరు సినీ నటులు డబ్బుల కోసం తెరపై నటించడమే కాకుండా తెరవెనుక ఏ పనైనా చేయడానికి సిద్ధ పడుతున్నారు. తాజాగా కోబ్రాపోస్ట్ మీడియా సంస్థ ఆపరేషన్ కరావోకే పేరిట నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బాలీవుడ్‌కు చెందిన 36 మంది తారలు డబ్బులు తీసుకొని కొన్ని రాజకీయపార్టీలకు అనుకూలంగా తమ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పోస్టింగులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాకుండా ఆప్ వంటి ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా కూడా వారు పోస్టింగ్‌లు పెట్టేందుకు సిద్ధపడ్డారు. వీరిలో జాకీష్రాఫ్, శక్తికపూర్, వివేక్ ఓబెరాయ్, సోనూసూద్, అమీషా పటేల్, మహిమా చౌదరి, రాఖీ సావంత్, పూనం పాండే, సన్నీ లియోనీ తదితరులు న్నారు. తాము కోరిన డబ్బు ఇస్తే రాజకీయ పార్టీలకు అనుకూలంగా అభిప్రాయా లు వెల్లడించేందుకు వారు అంగీకరించారు. ఒక్కో పోస్టింగ్‌కు 2 లక్షల నుంచి 50 లక్షల వరకు డిమాండ్ చేశారు.

కొందరు కళాకారులైతే డబ్బిస్తే తమ సోషల్ మీడియాలో అకౌంట్‌ల ద్వారా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల ప్రచారంలో సాయ పడతామని అంగీకరిస్తూ కెమారాకు దొరికిపోయారు ఒకరైతే ఏకంగా 8 నెలల కాంట్రాక్టుకు 20 కోట్లు డిమాండ్ చేశారు. వీరందరూ తాము కోరిన డబ్బును నగదుగా చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది. మహిమా చౌదరి ఒక్క పోస్టింగ్ కు కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఇక తొలుత 20 కోట్లు డిమాండ్ చేసిన సోనూసూద్ ఆ తరువాత నెలకు 2.50 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. వివేక్ కోబ్రాయ్ కూడా భారీగానే డిమాండ్ చేశాడు. తన భర్తకు భారత పౌరసత్వం ఇస్తే, తాను బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధమని సన్నీ లియోనీ చెప్పారు. రాఖీసావంత్ పోయినసారి కూడా ఇలానే చేసానంటూ రాఖీసావంత్ గొప్పలకు పోయింది. మొత్తానికి బాలీవుడ్ తారలు. తెర ముందే కాదు తెర వెనుక కూడా ఇలా నటిస్తూ మనీ కోసం అభిప్రాయాలను అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories