Top
logo

ట్రేడ్ యూనియ‌న్ల ఆందోళ‌న‌.. దేశవ్యాప్తంగా ఎఫెక్టు

ట్రేడ్ యూనియ‌న్ల ఆందోళ‌న‌.. దేశవ్యాప్తంగా ఎఫెక్టు
Highlights

దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత, అసంఘటిత రంగాలకు చెందిన దాదాపు 20 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి.

దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత, అసంఘటిత రంగాలకు చెందిన దాదాపు 20 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి. వైద్య, బ్యాంకింగ్‌, తపాల రవాణా రంగాల సేవలకు అంతరాయం ఏర్పడింది. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు దిగారు. బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్ మినహా ఇతర కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. టెలికం, వైద్య, విద్య, బొగ్గు ఉక్కు, విద్యుత్ ,బ్యాంకింగ్, బీమా, రవాణా తదితర రంగాల ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ మినహా మిగతా కార్మికసంఘాలన్ని రోడ్డెక్కాయి.

కార్మిక సంఘాలతో చర్చించకుండా మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సంస్కరణలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగుల, కార్మికుల పొట్టకొట్టే విధంగా కేంద్రప్రభుత్వ విధానాలున్నాయని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులను ఇబ్బందులు పెట్టి బడా వ్యాపారవేత్తలు రుణాల ఎగవేతను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, కార్మికులు కదం తొక్కారు. ధర్నాలు, ప్రదర్శనలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రంగ సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించరాదని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాలని కోరారు.

విజయవాడ, అనంతపురం, ప్రకాశం, విశాఖ జిల్లాల్లోనూ కార్మిక వర్గాలు సమ్మె బాటపట్టాయి. పలు చోట్ల ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేసి ఆoదోళనకు దిగారు ఉద్యోగులు. హన్మకొండ ఆంధ్రబ్యాంక్ వద్ద బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వరంగల్ రూరల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు అర్బన్, రూరల్ జిల్లా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఎల్ఐసి ఎన్డీపీసియల్ పోస్టల్ కార్యాలయాల్లో కార్యాకలాపాలు నిలిపివేసి ధర్నాకు దిగారు.

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీ మినహా మిగతా కార్మికసంఘాలన్ని రోడ్డెక్కాయి. నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారీ మానవహారం చేపట్టారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ కార్మికులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలోను సమ్మె ప్రభావం వడింది.

ఖమ్మం జిల్లాలోనూ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వైరాలో కార్మిక సంఘాల ఆద్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కార్మికులు సమ్మె చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ చేపట్టాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కడప,పొద్దుటూరు ముద్దనూరులో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కడప మున్సిపల్ కార్యాలయం నుంచి పాత కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది కార్మికులు పాల్గోన్నారు. ముద్దనూరులో కార్మికుల నిరసనకు మాజీ మంత్రి మైసూరా రెడ్డి మద్దతు పలికారు. నెల్లూరు ఆర్టీసీ సర్కిల్ లో వామపక్షాలు ఆందోళనకు దిగారు. వాహనాలను అడ్డుకున్నారు. రాజమండ్రిలో బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. గోదావరి గ్రామీమ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు.


లైవ్ టీవి


Share it
Top