చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్తున్న మహిళ కన్నీరు...

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్తున్న మహిళ కన్నీరు...
x
Highlights

కోతులు చేసే అల్లరి పనులు చాలామందికి చిరాకు తెప్పిస్తాయి. గుళ్ల దగ్గర భక్తులను భయపెట్టడమే కాదు చెట్ల కొమ్మలపై అటు ఇటూ దూకుతూ వింత చేష్టలతో నవ్వులు...

కోతులు చేసే అల్లరి పనులు చాలామందికి చిరాకు తెప్పిస్తాయి. గుళ్ల దగ్గర భక్తులను భయపెట్టడమే కాదు చెట్ల కొమ్మలపై అటు ఇటూ దూకుతూ వింత చేష్టలతో నవ్వులు పూయిస్తాయి. ఇక ఆకలితో ఊళ్ళ మీద పడి జనాలను నానా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కానీ ఓ కోతి చేసిన చేష్టలు చూస్తే ముచ్చటేస్తోంది. కోతెమ్మ చేసిన ఆ కొంటే పని రీసెంట్‌గా నెట్టింట్లో వైరల్‌గా మారడమే కాదు అది చేసిన పనికి యావత్ ప్రజానికం సలాం కొడుతోంది. అసలు కోతి చేసిన ఆ పనేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

కొన్ని సార్లు మన మధ్య అకస్మాత్తుగా జరిగే సన్నివేశాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మనం చుట్టు ఉండే సాదు జంతువులు మనకేదైనా జరిగితే వెంటనే మన చుట్టూ చేరుతాయి. మనం బాధలో ఉంటే అవి కూడా ఎంతో బాధపడ్డట్టుగా ఫీల్ అవుతుంటాయి. ఇక సినిమాల్లో తాము పెంచుకునే జంతువులు వారిని రక్షించే సీన్‌ లు, వారు బాధపడితే ఓదార్చే సన్నివేశాలు చూశాం. కానీ ఇదే సీన్ రియల్ లైఫ్ లో జరిగింది. అవును ఓ కోతి మహిళను ఓదార్చడం చూస్తుంటే ఒకంత నవ్వు వచ్చినా నిజంగా దాని బాధ చూసి మనకు కూడా జాలి కలుగుతుంది.

కర్ణాటక నార్‌గుండ్‌లో 80 ఏళ్ల మహిళ మూడ్రోజుక్రితం చనిపోయింది. ఆమె మృతదేహం వద్ద బంధువులు బోరుమని ఏడుస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఓ కోతి వచ్చి గుండెలవిసేలా రోదిస్తున్న మహిళను ఓదార్చింది. ఆమె తలపై చేయిపెట్టి ఓదార్చుతూ భుజాన్ని తట్టింది. ఏడవకు ఏడవకు ఊరుకో అన్నట్లుగా ఓదార్చిన తీరుతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే ఆశ్చర్యపోయారు.

ఓ మనిషిని మరో మనిషి ఓదార్చినట్లు కోతి వచ్చి తల నిమురడంతో పాటు దగ్గరకు తీసుకొని ఓదార్చడం చూస్తుంటే నిజంగా మాయలా అనిపించిందని అంటున్నారు అక్కడి వారు. ఆమె తలపై చేయిపెట్టి ఓదార్చుతూ భుజాన్ని తట్టడం చూస్తుంటే ఏ జన్మ బంధమో అని అంటున్నారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు చిత్రీకరించి సోషల్‌మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈసీన్‌ వైరల్‌గా మారింది.

అయితే గతంలోనూ ఈ కోతి పలువురి ఇళ్లలోకి వెళ్లి ఓదార్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. గట్టిగా ఏడుస్తున్న శబ్ధం వినిపిస్తే చాలు అక్కడ కోతి ప్రత్యక్షమవుతుందట. మనుషులు తోటి మనుషులను ఓదార్చినట్లుగానే కోతి కూడా చేస్తుందని పలువురు స్థానికులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories