కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు : మోహన్‌బాబు

కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు : మోహన్‌బాబు
x
Highlights

సినీ నటుడు మోహన్‌బాబుకు హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టు ఎడాది జైలు శిక్ష విధించింది. చెక్‌బౌన్స్‌ కేసులో ఏ-1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, ఏ-2గా...

సినీ నటుడు మోహన్‌బాబుకు హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టు ఎడాది జైలు శిక్ష విధించింది. చెక్‌బౌన్స్‌ కేసులో ఏ-1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, ఏ-2గా మోహన్‌బాబును దోషులుగా తేల్చిన కోర్టు లక్షా 25 వేలు జరిమానా విధించింది. మూడు నెలల్లోగా బాకీ చెల్లించాలని ఎర్రమంజిల్‌ కోర్టు ఆదేశించిందిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై మోహ‌న్‌బాబు స్పందించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ గత2009లో స‌లీమ్ సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమా ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశామని కాగా మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి వైవిఎస్ చౌదరికి రూ.40ల‌క్ష‌ల చెక్ ఇచ్చామన్నారు. అయితే సలీమ్ చిత్రం అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో వైవిఎస్ చౌద‌రితో చేయాల్సిన తర్వాతి సినిమాను వ‌ద్ద‌నుకున్నామన్నారు. కాగా ఆ సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరికి స్పష్టం చేశామని చెప్పారు. కాగా ఆ చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని వైవిఎస్‌కి చెప్పామన్నారు. చెక్‌ను బ్యాంక్‌లో వేయొద్దని చెప్పినా కూడా కావాల‌నే వైవిఎస్ చౌదరి చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ బౌన్స్ చేశారని మోహన్ బాబు ఆరోపించారు. నాపై చెక్ బౌన్స్‌ కేసు వేసి కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో చాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మవద్దు అని పేర్కొంటు మోహన్‌ బాబు పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories