Top
logo

తెలుగు రాష్ట్రాలకు జాతీయ పార్టీల అగ్రనేతలు క్యూ

తెలుగు రాష్ట్రాలకు జాతీయ పార్టీల అగ్రనేతలు క్యూ
X
Highlights

పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు క్యూ కడుతున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్...

పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు క్యూ కడుతున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ పర్యటించగా ఇవాళ మోడీ వస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఇద్దరూ ఒకే రోజు ప్రచారంతో హోరెత్తించబోతున్నారు. మోడీ ఇవాళ రాజమహేంద్రవరం, హైదరాబాద్‌ బహిరంగ సభల్లో పాల్గొంటారు.

గుంటూరు, విశాఖ, కర్నూలులో ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోఢీ ఇవాళ రాజమహేంద్రవరం వస్తున్నారు. మధ్యాహ్నం 1.30కి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ వేదికగా జరిగే సభలో మోఢీ పాల్గొంటారు. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బీజేపీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణాన్ని కేంద్ర భద్రతా బృందం పరిశీలించి పలు సూచనలు చేసింది.

ఇక రాజమండ్రి సభ తర్వాత మోడీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే విజయ సంకల్ప సభకు హాజరౌతారు. గత నెల 29న పాలమూరులో మోడీ సభ విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో ఎల్బీ స్టేడియం సభను సక్సెస్ చేయాలనే పట్టుదలతో బీజేపీ నేతలు పని చేస్తున్నారు. మోడీ సభ తర్వాత తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరుగుతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. నిన్ననే బీజేపీలో చేరిన కాంగ్రెస్ తాజా మాజీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మోడీ సభలో బీజేపీ కార్యకర్తలకు పరిచయం అవుతారు. అలాగే మాజీమంత్రి విజయరామరావు ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

Next Story