logo

ఆధ్యాత్మిక యాత్రలో మోదీ...

ఆధ్యాత్మిక యాత్రలో మోదీ...
Highlights

ఎన్నికల ప్రచార హడావుడి నుంచి బయటకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు....

ఎన్నికల ప్రచార హడావుడి నుంచి బయటకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని శనివారం సందర్శించుకున్న ఈ రోజు ఆలయానికి దగ్గర్లో ఉన్న పవిత్ర గుహలో ధ్యానం చేస్తున్నారు. దానికోసం ఆయన రెండు కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు మోడీ ధ్యానంలోనే ఉండనున్నట్లు సమాచారం.ఉత్తరాఖండ్‌లో రెండు రోజులు పర్యటనలో భాగంగా ప్రధాని ఆదివారం బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. గతంలో పలుమార్లు ఆయన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడంతో పాటు ప్రత్యక పూజలు కూడా జరిపించారు. ఇవాళ చివరి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తిగా మారింది.


లైవ్ టీవి


Share it
Top