మరోసారి అక్కడి నుంచి మోడీ పోటీ..!

మరోసారి అక్కడి నుంచి మోడీ పోటీ..!
x
Highlights

రానున్న లోకసభ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ స్థానం నుండి పోటీచేస్తారో అని నిన్నటి వరకు అందరి లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి మోడీ...

రానున్న లోకసభ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ స్థానం నుండి పోటీచేస్తారో అని నిన్నటి వరకు అందరి లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి మోడీ ఎక్కడి నుండి పోటీచేస్తారన్న ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో​ 5,81,022 5,81,022 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ ధఫా కూడా వారాణాసి నుంచే ఎన్నికల బరిలో దిగుతారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు శనివారం ఆపార్టీ పార్లమెంటరీ కమిటీ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఇక ఈ సమావే‎శంలో ముఖ్యంగా ప్రధాని మోడీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంపై చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మోదీతో సహా, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories