ఓసీలకు రిజర్వేషన్లు

Narendra Modi
x
Narendra Modi
Highlights

మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగ నియామకాల్లో ఇకపై ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణాల పేదలకు 10 శాతం కోటా ఉండనుంది.

సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా ప్రధాని మోడీ కొత్త అస్త్రాన్ని సంధించారు. లోక్‌సభ ఎన్నికల్లో అగ్రవర్ణ పేదలను తమ వైపు తిప్పుకునేందుకు మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణాల ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోడీ క్యాబినెట్ నిర్ణయించింది. ఐదెకరాల కంటే తక్కువ పొలం ఉన్నఅగ్రవర్ణాలకే రిజర్వేషన్లకు అర్హులని కేంద్రం నిర్ణయించింది. అదే విధంగా 1000 చదరపు అడుగుల ఇంటిస్థలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రేపు పార్లమెంట్‌ ముందుకు రిజర్వేషన్ల బిల్లు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16కు కేంద్రం సవరణలు చేసే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న రిజర్వేషన్లు 49.5 శాతం ఉన్నాయి. వాటిలో ఎస్సీకి 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ 27 శాతం ఉన్నాయి. తాజాగా ఈబీసీ రిజర్వేషన్లు 10 శాతం కల్పించడంతో మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతానికి పెరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories