పీఎం మోదీ బయోపిక్ రిలీజ్ డేట్ ఇదే...!

పీఎం మోదీ బయోపిక్ రిలీజ్ డేట్ ఇదే...!
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశ్ భక్తి యే మేరా...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశ్ భక్తి యే మేరా శక్తి అనేది క్యాప్షన్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ నరేంద్రమోడీ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఈనెల 11న విడుదల కావాల్సి ఉంది. అయితే సరిగ్గా విడుదలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఈ సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా ఓటర్ల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమా విడుదలను ఆపు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష పార్టీల అభ్యంతరాల మేరకు ఈ సినిమా విడుదలపై స్టే విధించింది. ఇక మే 19న సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగియనుంది. ఇక ఇటు మే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఇక ఆ తర్వాత ఎలాంటి కోడ్ ఉండదు కాబట్టి ఈ సినిమాను మే 24 న విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర నిర్మాత సందీప్ సింగ్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories