సోషల్ మీడియాకు ఎన్నికల కోడ్

సోషల్ మీడియాకు ఎన్నికల కోడ్
x
Highlights

లోక‌సభ ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘన‌పై ఈసి సీరియస్ గా దృష్టి సారించింది. వాట్సాప్, ఫేస్ బుక్స్ వంటి సామాజిక మాద్యమాల్లో తమ అభ్యర్థుల ప్రచారం పేరుతో....

లోక‌సభ ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘన‌పై ఈసి సీరియస్ గా దృష్టి సారించింది. వాట్సాప్, ఫేస్ బుక్స్ వంటి సామాజిక మాద్యమాల్లో తమ అభ్యర్థుల ప్రచారం పేరుతో. ఇతరులను కించపరిచే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ తెలిపింది. ప్రసారా మాధ్యమాల్లో వచ్చే వార్తలను కూడా పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వ‌చ్చే పోస్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు ఈసీ తెలిపింది. దీనికోసం డేటా అనలిటిక్స్ టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన ప్రైవేట్ ఐటి కన్సల్టెన్సీ ఏజెన్సీకి బాధ్యతలను అప్పగించారు. రాజకీయ పార్టీలు, ఎన్నికలకు సంబంధించి వస్తున్న ప్రతి పోస్టును ఆ ఏజెన్సీ మానిటర్ చేస్తూ రోజువారీగా సీఈఓ కార్యాలయానికి నివేదికలు అందించనుంది. వీటి ఆధారంగా కోడ్ ఉల్లంఘించిన నోటీసులు జారీ చేయడం తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు పంపడం జరుగుతుంది.

ప్రస్తుతం ప్రచారం కోసం సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు విరివిగా వినియోగించుకుంటున్నాయి. ఫేస్‌బుక్, ట్వీట్టర్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థులపై ఆరోపణలు ప్రత్యారోపణల కోసం అధికార, విపక్ష పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల ఐటి విభాగాలు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఈ మాధ్యమాల వాడకం భారీగా పెరిగి ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది ఈసి.

ముఖ్యమంత్రి, మంత్రులు, విపక్ష నాయకులు, రాజకీయ పార్టీలు, జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైతం ఈ విభాగం దృష్టి పెట్టింది. ఈ ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తున్న లైక్‌లు, షేర్ల సంఖ్య, కామెంట్ల ఆధారంగా ప్రచార సరళిని కన్సల్టెన్సీ రోజువారీగా విశ్లేషిస్తోంది. రాజకీయ పోస్టుల్లో కొన్నింటిని ఎవిడెన్స్ కోసం జత చేసి రోజువారీ నివేదికలతో సిఇఒ కార్యాలయానికి సమర్పిస్తోంది. అయితే ఉల్లంఘనలపై కొన్నింటిని సుమోటోగా కూడా సిఇఒ కార్యాలయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రతి ఫిర్యాదు పై సుమోటో తీసుకోవడం సాధ్యం కాకపోయినా స్వయంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునే ఛాన్స్ మాత్రం ఉందని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories