కవిత ఓటమికి కారణమదే: జీవన్‌ రెడ్డి

కవిత ఓటమికి కారణమదే: జీవన్‌ రెడ్డి
x
Highlights

నిన్న గురువారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అందులో అధికార పార్టీ టీఆర్ఎస్‌కి తొమ్మిది సీట్లే దక్కించుకుంది. అయితే ఈ...

నిన్న గురువారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అందులో అధికార పార్టీ టీఆర్ఎస్‌కి తొమ్మిది సీట్లే దక్కించుకుంది. అయితే ఈ ఫలితాలకు ముందు ఎగ్జీట్ పోల్స్ లో మాత్రం లోక్ సభ ఎన్నికల్లోనూ కారు హావా చూపుతుందని సర్వేలు చెప్పుకుంటూ వచ్చాయి. కానీ నిన్న వెలువడిన ఫలితాలు మాత్రం అందుకు బిన్నంగా వచ్చాయి. టీఆర్ఎస్9, కాంగ్రెస్ 3, బీజేపీ4, ఎంఐఎం1 గా ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, గూలాబీ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుబిడ్డ కల్వకుంట్ల కవిత ఓడిపోవడం ఇప్పడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కల్వకుంట్ల కవిత ఓడిపోవాడానికి గల కారణాలనూ జీవన్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత, నిర్లక్ష్యమే కవిత ఓటమికి కారణమని జీవన్ రెడ్డి అన్నారు.

అయితే గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా కవిత ఓటమి గల కారణమని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు ఈ ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై అయ్యాయని ఆరోపణలు చేశాయి. అధికార పార్టీ ఆరోపణలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి స్పందించారు. అసలు బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మకైతే మరీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓటుబ్యాంక్‌ ఎటుపోయిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతల అసమర్థతే కవిత ఓటమికి కారణమన్నారు. సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి పార్లమెంట్‌ ఎన్నికలపై పూర్తి ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories