కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు...ఆ ఇద్దరు ఎవరనేదానిపై ఆసక్తికరమైన చర్చ

కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు...ఆ ఇద్దరు ఎవరనేదానిపై ఆసక్తికరమైన చర్చ
x
Highlights

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌ నెంబర్‌ వన్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌ నెంబర్‌ వన్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా వచ్చి ఓటేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మొత్తం 5 స్థానాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అసెంబ్లీలోని కమిటీ హాల్‌ నెంబర్‌ వన్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకోసం అసెంబ్లీ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది ఎమ్మెల్యే ఓట్లు కావాల్సి ఉంది. దీంతో 5 స్థానాలకు మొత్తం 105 మంది ఎమ్మెల్యే ఓట్లు అవసరం అవుతాయి. ప్రాధాన్యథా క్రమంలో ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌, ఎంఐఎం ప్రకటించిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వారికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 91 కాగా ఎంఐఎం సభ్యులు ఏడుగురితో కలిపి మొత్తం 98 మంది ఉన్నారు. వీరితో పాటు ఆత్రం సక్కు, రేగా కాంతారావుతో పాటు సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్‌కు జై కొట్టడంతో పాటు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి చేరికతో ఆ సంఖ్య 103 కి చేరింది.

దీంతో ఐదుగురు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే టీఆర్ఎస్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యే ఓట్లు అవసరం అవుతోంది. మరి ఆ ఇద్దరు ఎవరనే అంశమే ఆసక్తికరంగా మారింది. మొదటి ప్రాధాన్యతా ఓటు ద్వారానే విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్‌ మరో పది మంది వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని భారీ బాంబు పేల్చారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సభ్యులు తప్పులు చేయకుండా ఉండేందుకు నిపుణులతో అవగాహన కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories