Top
logo

కేసీఆర్‌కు రాజాసింగ్ హెచ్చరిక

కేసీఆర్‌కు రాజాసింగ్ హెచ్చరిక
X
Highlights

బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్‌ బోర్డు...

బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్‌ బోర్డు తీరుకు నిరసనగా దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ ను అరెస్ట్‌ చేశారు. పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొద్దిసేపు పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుతున్న వారిని అరెస్టులు చేయడం అన్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రజల గురించి మాట్లాడ వద్దా..? పోరాడ వద్దా అని ప్రశ్నించారు.

తెలంగాణలో యువతి, యువకుల ప్రాణాలు తీసుకుంటున్నా కానీ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రజాకార్లను మించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీకెలాగు చేతకాదు పోరాడేవాళ్లను కూడా అరెస్ట్ చేస్తారా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్కమాట గుర్తుపెట్టుకు తెలంగాణ రాష్ట్రం యువకుల వల్లనే వచ్చింది, వారి వల్లనే నేడు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే యువకుల వల్ల సర్వనాశనం కాబోతున్నారని విమర్శించారు.

Next Story