logo

పేపర్‌ చదువుతూ గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

పేపర్‌ చదువుతూ గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఆర్ కనగరాజ్ గురువారం ఉదయం న్యూస్‌ పేపర్‌ చదువుతూ గుండెపోటుతో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రంలోని సులూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనగరాజ్. ఎమ్మెల్యే కనగరాజ్‌ ఈ రోజు ఉదయం న్యూస్‌ పేపర్‌ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ స్థానాల సంఖ్య 22కు చేరింది. 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఐదుగురు ఎమ్మెల్యేలు మరణించారు.

లైవ్ టీవి

Share it
Top