Top
logo

రెండో జాబితాలోనూ ఆమెకు టికెట్‌ అనుమానమే..!

రెండో జాబితాలోనూ ఆమెకు టికెట్‌ అనుమానమే..!
X
Highlights

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండంతో అభ్యర్థులను ప్రకటించడంలో పార్టీ అధినేతలు ఫుల్ బీజిగా ఉన్నారు. అయితే అధికార...

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండంతో అభ్యర్థులను ప్రకటించడంలో పార్టీ అధినేతలు ఫుల్ బీజిగా ఉన్నారు. అయితే అధికార పార్టీ టీడీపీలో అసంతృప్తల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా ఆ జాబితాలో టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాతా పేరు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు సుజాతా. ఆమే స్థానంలో కర్రా రాజారావుకు అధిష్టానం కేటాయించింది. అయితే మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటు కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే సుజాతా సీటు విషయంలో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు వర్గం వ్యతిరేకతతో సుజాతకు సీటు కేటాయించలేదని వార్తాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ రెండో జాబితాలో కూడా ఆమెకు టికెట్‌ దక్కడం అనుమానమేనని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story