జనసేనలో చేరిన భాజపా ఎమ్మెల్యే

జనసేనలో చేరిన భాజపా ఎమ్మెల్యే
x
Highlights

రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఆకుల సత్యనారాయణకు విజయవాడలో కండువా కప్పి పార్టీలోకి పవన్‌ ఆహ్వానించారు. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీతో విజయవాడ చేరుకున్న ఆకుల సత్యనారాయణ పవన్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.

రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఆకుల సత్యనారాయణకు విజయవాడలో కండువా కప్పి పార్టీలోకి పవన్‌ ఆహ్వానించారు. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీతో విజయవాడ చేరుకున్న ఆకుల సత్యనారాయణ పవన్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. నిన్న ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆకుల సత్యనారాయణ తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణకు మెయిల్ చేశారు. అలాగే ఆయన వర్గీయులు, అనుచరులు కూడా భారీ సంఖ్యలో జనసేనలో చేరారు. బీజేపీకి రాజీనామా చేశారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని, రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆకుల పేర్కొన్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories