మిషన్ చాణక్య సర్వే ఫలితాలు కలకలం..

మిషన్ చాణక్య సర్వే ఫలితాలు కలకలం..
x
Highlights

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగిశాయి. దీంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. మిషన్ చాణక్య విడుదల చేసిన ఏపీ అసెంబ్లీ...

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగిశాయి. దీంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. మిషన్ చాణక్య విడుదల చేసిన ఏపీ అసెంబ్లీ సర్వే ఫలితాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీకి 98, టీడీపీకి 58, జనసేన పార్టీకి 7, బీజేపీకి ఒక స్థానం రావొచ్చని విడుదల చేసింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తోంది. ఏపీలోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ప్రజల అభీష్టం మేరకే ఎన్నికలు ఫలితాలు ఉంటాయని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories