మిషన్‌.. 150+

మిషన్‌.. 150+
x
Highlights

అసెంబ్లీ టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొదటి విడతగా 126 మంది పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. మిగతా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను విడతల...

అసెంబ్లీ టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొదటి విడతగా 126 మంది పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. మిగతా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటిస్తామని చెప్పారు. కొందరు ఎంపీ అభ్యర్థుల పేర్లను ఇవాళ విడుదల చేస్తామన్న చంద్రబాబు మిషన్ 150 ప్లస్ సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

మిషన్ 150 ప్లస్. ఇదీ చంద్రబాబు మిషన్... టీడీపీ స్లోగన్.150కి పైగా సీట్లే టార్గెట్‌గా చంద్రబాబు తొలి విడతలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో ఆమోదం పొందిన తర్వాత 126 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేశారు. కొందరు సిట్టింగులకు స్థానచలనం కల్పించిన చంద్రబాబు మరికొందరు సిట్టింగులకు అవకాశం కల్పించలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి 9 మందికి , విజయనగరం జిల్లా నుంచి ఆరుగురికి, విశాఖ జిల్లా నుంచి 11 మందికి మొదటి విడతలో అవకాశం దక్కింది. అలాగే రాజకీయంగా కీలమైన తూర్పు గోదావరి జిల్లా నుంచి 16 మందికి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 11 మందికి ఫస్ట్ లిస్ట్‌లో చోటు కల్పించారు.

ఇక కృష్ణా జిల్లా నుంచి 14 మంది అభ్యర్థులు, గుంటూరు జిల్లాకు చెందిన 14 మంది పేర్లను విడుదల చేశారు. ప్రకాశం జిల్లా నుంచి 10 మంది నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు పేర్లను చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లా నుంచి ఏడుగురు, కర్నూలు జిల్లాకు చెందిన 9 మంది, అనంతపురం జిల్లా నుంచి ఐదుగురు , చిత్తూరు జిల్లా నుంచి ఎనిమిది మంది పేర్లను చంద్రబాబు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పం నుంచి బరిలోకి దిగుతున్నారు. మంత్రి లోకేష్ మంగళగిరి నుంచి, సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీ రాయపాటి తన కుమారుడి కోసం పట్టుపట్టిన సత్తెనపల్లి స్థానాన్ని మరోసారి స్పీకర్ కోడెలకే చంద్రబాబు కేటాయించారు. ఇంతకాలం సస్పెన్స్ రేపిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు కు విశాఖ నార్త్ సీటు ఇచ్చారు.

అభ్యర్థులను IVRS సర్వే ద్వారా ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. కుల మతాలు, రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు వివరించారు ఇప్పుడు అవకాశం రాని నేతలకు భవిష్యత్ లో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సుపరిపాలనే తమను గెలిపిస్తుందన్న చంద్రబాబు వినూత్న పథకాలను అమలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories