మొదటి జాబితాలో పలువురు మంత్రుల పేర్లు

మొదటి జాబితాలో పలువురు మంత్రుల పేర్లు
x
Highlights

పలువురు మంత్రులకు , పలువురు సిట్టింగులకు టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కింది. ఎక్కువ పోటీ లేని, వివాదాస్పదం కాని అభ్యర్థులకు మొదటి జాబితాలోనే పేరు...

పలువురు మంత్రులకు , పలువురు సిట్టింగులకు టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కింది. ఎక్కువ పోటీ లేని, వివాదాస్పదం కాని అభ్యర్థులకు మొదటి జాబితాలోనే పేరు ఖరారు చేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన అనేక మంది సిట్టింగులకు మళ్ళీ అవకాశం దక్కింది. మంత్రులు దేవినేని ఉమ మైలవరం నుంచి , కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి బరిలో ఉన్నారు. అలాగే ప్రతిష్టాత్మకమైన గుడివాడ సీటును దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌‌కు కేటాయించారు. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్, గన్నవరం - వల్లభనేని వంశీ, విజయవాడ సెంట్రల్‌ - బొండా ఉమ, విజయవాడ ఈస్ట్ ‌- గద్దె రామ్మోహన్‌ పోటీ చేస్తున్నారు. విజయవాడ వెస్ట్‌ సీటును సిట్టింగ్ అయిన జలీల్ ఖాన్‌కు కాకుండా ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌కు ఇచ్చారు.

గుంటూరు జిల్లాలో కూడా పలువురు సిఠ్టింగులకు రెండో సారి అవకాశం ఇచ్చారు. స్పీకర్ కోడెల శివప్రసాద్‌పట్ల టీడీపీ శ్రేణుల్లో కొంత వ్యతిరేకత ఉన్నా ఎంపీ రాయపాటి సాంబశివరావు తన కుమారుడి కోసం పట్టుపట్టినా సత్తెనపల్లి సీటును సభాపతికే కేటాయించారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులకు వారి సీట్లను వారికే ఇచ్చారు. చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు బరిలో నిలిచారు. తెనాలి - ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్రకు ఇచ్చారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి మంత్రి నారా లోకేష్‌ మొదటిసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రచారం షురూ చేసిన లోకేష్ మంగళగిరిలో ఈసారి టీడీపీకి భారీ మెజార్టీ ఖాయమంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మంత్రి చిన రాజప్పకు మళ్ళీ అవకాశం దక్కింది. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురం - తోట త్రిమూర్తులుకు ఇచ్చారు. వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచచుకున్న జ్యోతుల నెహ్రూకు జగ్గంపేట సీటు దక్కింది. తుని నుంచి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పోటీ పడుతున్నారు. పశ్చిమ గోదావరిలో మంత్రి పితాని సత్యనారాయణ ఆచంట నుంచి బరిలో నిలవగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చింతమనేని ప్రభాకర్ మళ్ళీ దెందులూరులోనే పోటీ చేస్తున్నారు.

ఇంతకాలం ఏ సీటు కావాలో తేల్చుకోలేక డైలమాలో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ నార్త్ సీటు ఇచ్చారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్నారు. అటు శ్రీకాకుళం జిల్లా మంత్రులు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి , కళా వెంకట్రావు, ఎచ్చెర్ల నుంచి బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చి మంత్రి అయిన విజయనగరం జిల్లాకు చెందిన సుజయ కృష్ణ రంగారావుకు మళ్ళీ బొబ్బిలి సీటు దక్కింది. ప్రకాశం జిల్లా చీరాల సీటును కరణం బలరాంకు కేటాయించగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికి అద్దంకి సీటును ఇచ్చారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి బరిలో నిలవగా నెల్లూరు అర్బన్ నుంచి మంత్రి నారాయణ తలపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories