విశాఖ అసెంబ్లీ సీటుపై మంత్రి నారా లోకేష్ కన్ను...అవంతికి చెక్ పెట్టాలని మంత్రి గంటా...

విశాఖ అసెంబ్లీ సీటుపై మంత్రి నారా లోకేష్ కన్ను...అవంతికి చెక్ పెట్టాలని మంత్రి గంటా...
x
Highlights

విశాఖ అసెంబ్లీ సీటుపై మంత్రి నారా లోకేష్ చూపు పడిందా, భీమిలి లేదా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారా ? వైజాగ్ లో లోకేష్ పోటీపై...

విశాఖ అసెంబ్లీ సీటుపై మంత్రి నారా లోకేష్ చూపు పడిందా, భీమిలి లేదా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారా ? వైజాగ్ లో లోకేష్ పోటీపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. భీమిలిలో చినబాబు పోటీ చేస్తే గెలుపు ఖాయమనే వాదన వినిపిస్తోంది.

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ విశాఖ అసెంబ్లీ సీటుపై కన్నేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం నుండి లోకేష్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. భీమిలి టీడీపీకి కంచుకోట కావడంతో గెలుపు ధీమాగా ఉన్నారు లోకేష్.

భీమిలి చిన్న నియెజకవర్గం అయినా టీడీపీకి గట్టి పట్టు ఉంది. సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి కలిసివస్తోంది. దీనికి తోడు సంక్షేమ పథకాలకు ఆదరణ లభిస్తుండడంతో టీడీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమనే భావనలో ఉన్నారు చినబాబు.

ఇటీవల భీమిలి సీటు కోసం మంత్రి గంటా, ఎంపీ అవంతి శ్రీనివాస రావు పట్టుబట్టారు. సీఎం చంద్రబాబు హామీ ఇవ్వకపోవడంతో అవంతి శ్రీనివాస్ రావు పార్టీ మరారు. భీమిలిలో వైసీపీ తరపున అవంతి శ్రీనివాస రావు పోటీ చేయనున్నారు. లోకేష్ ను భీమిలి నుంచి పోటీ చేయించి అవంతికి చెక్ పెట్టాలని మంత్రి గంటా భావిస్తున్నారు.

భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తే, మంత్రి గంటా ఉత్తర విశాఖ నుంచి పోటీ చేసేందుకు యోచిస్తున్నారు. విశాఖ లో ఐటీ అభివృద్ధి, ఇతర సెంటిమెంట్లు టీడీపీకి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఒక వేళ భీమిలి కాకపోతే విశాఖ ఉత్తర నియోజకవర్గం పోటీ చేసేందుకు లోకేష్ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు లోకేష్ తోడల్లుడు భరత్ కూడా విశాఖ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఆచీతూచీ వ్యవహరిస్తున్న చంద్రబాబు లోకేష్ కు ఏ సీటు కేటాయిస్తారో అనే విషయంపై తెలుగు తమ్ముళ్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories