టీడీపీ నెత్తిన మరో పిడుగు : వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్న మంత్రి గంటా?

టీడీపీ నెత్తిన మరో పిడుగు : వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్న మంత్రి గంటా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. దీంతో రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. ఇక ఎన్నికల తరుణంలో వైసీపీలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. దీంతో రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. ఇక ఎన్నికల తరుణంలో వైసీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు తరలివస్తున్నారు. పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ పార్టీకి మాత్రం షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ కీలక నేత, మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి గుడ్ బై చెప్పాడానికి సిద్ధమౌతున్నరని సమాచారం. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకు తిరిగి అక్కడి నుంచి పోటీ బరిలో పాల్గోనేందుకు హామీ లభించకపోవడం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు ఆ టిక్కెట్ దాదాపుగా ఖాయమైపోయిందన్న ప్రచారం నేపథ్యంలో గంటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సైకిల్ వీడి వైసీపీలోకి చేరడం కూడా లాంఛనమే అన్న ఊహాగానాలు జోరుగానే వినిపిస్తున్నాయి. అయితే భీమిలి నియోజకవర్గం నుండి నారాలోకేష్ బరిలో దిగుతాడని ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన గంటా శ్రీనివాసరావు తనకు ఆ ముచ్చట తెలియదన్నడు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన గంటా ఇంతలోనే ఇలా తన నిర్ణయాన్ని మార్చుకోవడం అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాను వైసీపీ గూటికి చేరే విషమై తాను హైదరాబాద్ పయనమైనట్లు సమాచారం. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒక్కటే ప్రశ్న అసలు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నుండి హామీ లభించింది..? హామీ లభించాకే టీడీపీని వీడటానికి సిద్దపడ్డారా..?అన్న పలు విషయాలపై స్పష్ఠత రావాల్సి ఉంది. మొత్తానికి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories