Top
logo

అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ..: గంటా

అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ..: గంటా
X
Highlights

తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు...

తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలో ఓ పాఠశాల ఎక్స్‌పో ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో ముచ్చటించారు. తాను టీడీపీతోనే ఉంటానని పదే పదే చెప్పినా సోషల్‌ మీడియాలో తనపై వదంతులు వస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అవంతి శ్రీనివాస్ చేసిన విమర్శలపై స్పందించిన మంత్రి గంటా అతనిలా దిగజారి మాట్లాడే స్వభావం తనదికాదన్నారు. తాను లోక్‌సభ పోటీ చేయాలా? లేక అసెంబ్లీకి పోటీ చేయాలా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.

Next Story