Top
logo

నగరంలో అదో మినీ ఆఫ్రికా..

నగరంలో అదో మినీ ఆఫ్రికా..
X
Highlights

కనబడే వారంతా నల్లజాతీయులే. కానీ అదేమీ విదేశం కాదు. పక్కా మనదేశమే. ఇంకా చెప్పాలంటే మన హైదరాబాదే. అక్కడ అడుగుపెడితే చాలు ఏదైనా ఆఫ్రికా దేశానికి వెళ్లామా అనే డౌట్‌ రాకుండా ఉండదు.

కనబడే వారంతా నల్లజాతీయులే. కానీ అదేమీ విదేశం కాదు. పక్కా మనదేశమే. ఇంకా చెప్పాలంటే మన హైదరాబాదే. అక్కడ అడుగుపెడితే చాలు ఏదైనా ఆఫ్రికా దేశానికి వెళ్లామా అనే డౌట్‌ రాకుండా ఉండదు. ఆ ఏరియాలో ఎక్కడ చూసినా వారి జీవనస్థితిగతులు ఆశ్చర్యపరుస్తాయి. రకరకాల కారణాలతో హైదరాబాద్‌కు వస్తున్న ఆఫ్రికన్స్‌ లివింగ్‌ స్టైల్‌పై ప్రత్యేక కథనం.

ఆఫ్రీకన్స్‌ ప్రపంచ చరిత్రలో వీరిది ప్రత్యేక స్థానం. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వీరు కనిపిస్తారు. అలాగే మనదేశంలో కూడా. అందునా మినీ ఇండియాగా పేరుగాంచిన మన హైదరాబాద్‌లో వారికి ప్రత్యేక కాలనీయే ఉంది. అక్కడ అడుగు పెట్టామా ఏదైనా ఆఫ్రికా దేశానికి వెళ్లామనే ఫీలింగ్‌ కలగకమానదు. అడుగడుగునా వారే కనిపిస్తారు.

పారామౌంట్‌ హిల్‌ కాలనీ. జూబ్లీహిల్స్‌కు ఆనుకుని ఉండే ఈ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తుంది. ప్రతీ దేశానికి చెందిన వారికి ప్రత్యేక జీవనశైలి ఉంటుంది. అందులో ఆఫ్రికన్స్‌ లివింగ్‌ స్టైల్‌ ఆకట్టుకోవడమే కాదు ఆశ్చర్యపరుస్తుంది కూడా. వైద్యం కోసమో లేదా విద్య కోసమో కారణమేదైనా ఆఫ్రికా దేశస్తులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.

మెడికల్ టూరిజంలో ముంబయి, చెన్నై తర్వాత హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. అంతర్జాతీయస్థాయి ఆసుపత్రులకు ఇక్కడ కొదువలేదు. దీంతో ఇటీవలి కాలంలో వైద్యం కోసం నగరానికి వచ్చే ఆఫ్రికన్ దేశస్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం హైదరాబాద్ నుంచి విమాన సౌకర్యాలు పెరగడంతో ఆఫ్రికన్‌ దేశస్తులు చికిత్స కోసం తరలివస్తున్నారు.

ఇక చాలామంది ఆఫ్రికన్‌ జాతీయులు ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాసదుపాయాలు లభిస్తుండటం తక్కవ ఖర్చుతో కోర్సులు అందుబాటులో ఉండటం వంటివి కలిసొస్తుండటంతో హైదరాబాద్‌ను బెస్ట్‌ ఆఫ్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఆఫ్రికాలో చాలా దేశాలు పేదరికంలో మగ్గుతున్నాయి. అక్కడ విద్య, వైద్యం అంత్యంత ఖరీదైనవిగా ఉండటంతో మధ్యతరగతి, పేదవారు వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్కడితో పోల్చితే హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుకే అందుబాటులో లభిస్తుండటంతో ఆఫ్రికా నుంచి దిగిపోతున్నారు. దీంతో పారామౌంట్‌ హిల్‌ కాలనీ అంటే చిన్నపాటి ఆఫ్రికా లాగా కనిపిస్తుంది.

నిన్నా నేడో కాదు ఎప్పుడో ఏళ్ల నుంచి ఇక్కడే జీవిస్తున్నారు ఆ ఆఫ్రికన్లు. చదువుల కోసమైనా.. చికిత్స కోసమైనా.. లేక ఇంకే కారణమైనా.. ఇక్కడే నివసిస్తున్న వారిప్పుడు.. పక్కా లోకల్‌. మనలో కలిసిపోయినా.. వారున్న చోటు.. వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభిస్తుంది. ఫుడ్‌ నుంచి లివింగ్‌ స్టైల్‌ వరకు.. పారామౌంట్‌ హిల్‌ కాలనీ.. ఓ మినీ ఆఫ్రికా.

సూడాన్‌, సొమాలియా, నైజీరియా, కాంగో, ఘనా వంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆఫ్రికన్స్‌ ఏళ్ల తరబడి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. దీంతో పారామౌంట్‌ హిల్‌ కాలనీలో ఆఫ్రికన్ సంస్కృతీ సంప్రదాయాలే దర్శనమిస్తాయి. వారి జీవనవిధానానికి అనుగుణంగా వ్యాపారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్లు ఆఫ్రికన్‌ రుచులతో పాటు అరేబియన్‌ వంటకాలనూ అందిస్తాయి.

ఆఫ్రికన్ ఘుమఘుమలే కాదు వారు ధరించే దుస్తులకు సంబంధించిన వ్యాపారాలు కూడా కనిపిస్తాయి. లాల్చీలాంటి పొడవాటి దుస్తులు వీరు ధరిస్తారు. మహిళలు ధరించే బుర్కాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రత్యేకంగా అద్దెకిచ్చే లాడ్జీలు సైతం కనిపిస్తాయి. దీంతో లివింగ్‌ కాస్ట్‌ అందుబాటులో ఉన్న హైదరాబాద్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ఇంటి అద్దెలు కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఇక్కడ తక్కువే. అంతేకాకుండా ఆఫ్రికన్లు చాలావరకు ఇస్లాంను అనుసరిస్తారు. హైదరాబాద్ లోనూ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం ప్రార్థనాస్థలాలకు కొదువలేక పోవటంతో హైదరాబాద్ ను బెస్ట్ చాయిస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ కాలనీలో ఉంటున్న పలువురు ఆఫ్రికన్లను హెచ్ఎంటీవి పలకరించింది. ప్రతీ ఒక్కరూ ఇండియన్ కల్చర్ మరీ ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలు చాలా స్నేహంగా ఉంటారని ఇక్కడ ఉంటే తమ స్వదేశంలో ఉన్నామనే భావనే కలుగుతందని చెబుతున్నారు.

కొందరు కుటుంబసమేతంగా హైదరాబాద్ కు వచ్చి నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. వీళ్లలో కొందరు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుంగా ప్రైవైట్ జాబ్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఏ పనిపై నగరానికి వచ్చినా వాళ్లు ఉండటానికి ఎంచుకునేది పారమౌంట్ హిల్ కాలనీయే. ఆఫ్రికన్స్‌ అంటే దుందుడుకు స్వభావం కలవారు. వివాదాల్లో ఎప్పుడూ ముందుంటారనే అభిప్రాయం ఉండటంతో వారికి గదులు అద్దెకివ్వాలంటే భయపడిపోతున్నారు. నేరాలు చేస్తూ పలువురు ఆఫ్రికన్ జాతీయులు తరచూ పట్టుబడుతుండటంతో మిగతా ఆఫ్రికన్స్‌కు తిప్పలు తప్పడం లేదు.

Next Story