అభినందన్ కు ఐదు రకాల వైద్య పరీక్షలు

అభినందన్ కు ఐదు రకాల వైద్య పరీక్షలు
x
Highlights

పాక్ నిర్బంధం నుంచి భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా అభినందన్ శారీరక సామర్ధ్యం తెలుసుకునేందుకు పరీక్షలు...

పాక్ నిర్బంధం నుంచి భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా అభినందన్ శారీరక సామర్ధ్యం తెలుసుకునేందుకు పరీక్షలు చేయనున్నారు. ఔషద ప్రయోగాలు ప్రయోగించి దేశ రహస్యాలు ఏమైనా రాబట్టారా హింసించి జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకునేందుకు ఐదు రకాల వైద్య పరీక్షలు చేపట్టనున్నారు.

పాక్ చెర నుంచి బయటపడి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అందరిలా సామాన్య జీవితం గడపడానికి మరికొంత సమయం పట్టనున్నది. అభినందన్ కు పూర్తి వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆర్మీ ఆధికారులు చెబుతున్నారు. శతృవుల చేజిక్కి ప్రాణాలతో బయపడిన అభినందన్ వల్ల జాతీయ భద్రత, దేశ రహస్యాలు బయటకు పొక్కే అవకాశాలున్న నేపద్యంలో ఐదు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు.

మొదట అభినందన్ శతృవులకు పట్టుబడ్డారు అనే విషయం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వరకు చోటుచేసుకున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఆ తర్వాత శారీరక సామర్థ్యం తెలుసుకోవడానికి అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పాకిస్థాన్‌ సైన్యం ఏమైనా చిప్స్‌ చొప్పించిందా? అనేది తెలుసుకునేందుకు శరీరానికి పూర్తిగా స్కానింగ్‌ చేస్తారు.

అభినందన్ కు ఔషధాలు ప్రయోగించి దేశ రహస్యాలేమైనా రాబట్టారా? హింసించి జాతీయభద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకున్నారా? తెలుసుకునేందుకు సైకలాజికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. దేశభద్రతకు సంబంధించిన నిఘా వర్గాలు, గూఢచారి విభాగం అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. సాధారణంగా తమ అధికారిని ఐబీ, గుడాచారి వర్గాలు ప్రశ్నించడానికి ఐఏఎఫ్‌ అంగీకరించదు. అభినందన్‌ విషయంలో ఇది అసాధారణ అంశం కాబట్టి, అందుకు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories