Top
logo

ఛత్తీస్ గఢ్‌లో ఇద్దరు పోలీసుల కిడ్నాప్...ఏఎస్‌ఐని హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్‌లో ఇద్దరు పోలీసుల కిడ్నాప్...ఏఎస్‌ఐని హతమార్చిన మావోయిస్టులు
X
Highlights

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లా పరిధిలోని జబిలి పోలీస్ స్టేషన్‌‌లో విధులు...

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లా పరిధిలోని జబిలి పోలీస్ స్టేషన్‌‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులను కిడ్నాప్ చేశారు. ఇందులో ఓ ఏఎస్‌ఐ పాటు మరో కానిస్టేబుల్ ఉన్నారు. వీరిలో ఏఎస్‌ఐ లలిత్‌ కశ్యప్‌ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం మావోయిస్టుల చెరలో కానిస్టేబుల్ బందీగా ఉన్నారు. దంతేవాడ అటవీ ప్రాంతంలో లలిత్‌ కశ్యప్‌ మృతదేహం గుర్తించిన పోలీసులు అక్కడే మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

Next Story