Top
logo

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు జవాన్లు మృతి
X
Highlights

ఛత్తీస్ గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు, భద్రత బలగాల మధ్య గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా ఈ...

ఛత్తీస్ గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు, భద్రత బలగాల మధ్య గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగింది. భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన దాడిలో నలుగురు జవాన్లు అమరులవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌ డీఐజీ పీ సుందరాజ్‌ మాట్లాడుతూ 114వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల నేపథ్యంలో కాంకేర్‌ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోలు కాల్పులు జరిపారిని ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని ధ్రువీకరించారు. కాగా గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

Next Story