నేడో, రేపో పరిషత్‌ షెడ్యూల్‌

నేడో, రేపో పరిషత్‌ షెడ్యూల్‌
x
Highlights

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి, రెండు...

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. మొదటి దశ మే 6, రెండో దశ మే 10, మూడో దశ ఎన్నికలు మే 14వ తేదీన నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సన్నాహక సమావేశం నిర్వహించింది ఈసీ.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ అతి త్వరలో విడుదల చేయనుంది. తొలి విడతగా మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లా పరిషత్‌లు ఉండగా 535 జెడ్పీటీసీలు, 5, 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తొలి విడతలో 212 జెడ్పీటీసీలు, 2,365 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే, రెండో విడతలో 199 జెడ్పీటీసీలు, 2,109 ఎంపీటీసీలు, మూడో విడతలో 124 జెడ్పీటీసీలు, 1,343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే, తొలి విడత ఎన్నికకు ఈ నెల 20న, రెండో విడతకు ఈ నెల 30న నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది ఈసీ.

ఇక రాష్ట్రంలో మొత్తం ఒకకోటి 56లక్షల 11వేల 320 మంది ఓటర్లు ఉండగా 32,007 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలకు కావాల్సిన బ్యాలెట్ పేపర్, ఇంక్ బాటిళ్లకు ఇప్పటికే ఆర్డర్ చేసింది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఎస్‌.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలతోపాటు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సజావుగా ఎన్నికల నిర్వహణపై చర్చించారు. మరోవైపు ఈ ఎన్నికలకు పరిశీలకులను కూడా ఈసీ నియమించింది. దీంతో స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి 25 రోజుల్లోగానే ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది ఎన్నికల సంఘం.

Show Full Article
Print Article
Next Story
More Stories