5 లీటర్ల బీర్లు తాగించి పునర్జన్మ కల్పించారు

5 లీటర్ల బీర్లు తాగించి పునర్జన్మ కల్పించారు
x
Highlights

ఓ దిక్కు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెల్లరినకాడి నుండి పడుకునేదాక టీవీలో, బయట యాడ్స్‌లో చూస్తుంటాం కానీ ఈ మద్యం వల్లే ఓ మనిషి ప్రాణాలతో బయటపడ్డయటా ఇది ఏకంగా వైద్యులు చేప్పిన ముచ్చటనే.

ఓ దిక్కు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెల్లరినకాడి నుండి పడుకునేదాక టీవీలో, బయట యాడ్స్‌లో చూస్తుంటాం కానీ ఈ మద్యం వల్లే ఓ మనిషి ప్రాణాలతో బయటపడ్డయటా ఇది ఏకంగా వైద్యులు చేప్పిన ముచ్చటనే. ఇక వివరాల్లోకి వెళితే వియత్నంకు చెందిన గుయెన్ వాన్ నాథ్(48) తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చిక్సిత నిమిత్తం వియత్నంలోని ఓ సర్కారు దవాఖానకు తరలించారు. గుయెన్‌కు వైద్య పరిక్షలు నిర్వహించారు. గుయెన్‌లో మిథనాల్ ఉండాల్పిన మోతాదు కంటే ఎక్కవ మోతాదులో ఉండడంతో అతని కాలేయం పాడైనట్లు వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఈ మిథనాల్‌ను కంట్రోల్ చేయాలంటే ఇథనాల్‌ను తన శరీరంలోకి పంపించాలి. అయితే బీర్లలో అధికంగా ఇథనాల్ ఉంటుంది కాబట్టి వెంటనే వైద్యులు ఆలస్యం చేయకుండా గుయెన్ శరీరంలోకి మొదటగా 3లీటర్ల బీరును ఇంజెక్టు చేశారు. కొద్దిసేపటికే మిథనాల్ స్థాయి తగ్గింది. ఇంకేముంది మరో 5లీటర్ల బీరును మళ్లీ ఇంజెక్ట్ చేశారు వైద్యులు. దీంతో మిథనాల్ స్థాయి సాధరణ స్థాయికి వచ్చింది. తరువాత గుయెన్ కాలేయంను శుభ్రపరిచారు. ఇగ మొత్తానికి గుయెన్‌కు శస్త్ర చికిత్సలు నిర్వహించడంతో గుయెన్ కాలేయం మొళ్లీగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం గుయెన్ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories