Top
logo

మళ్లీ పేలిన జియో ఫోన్‌ : వ్యక్తి మృతి

మళ్లీ పేలిన జియో ఫోన్‌ : వ్యక్తి మృతి
X
Highlights

టెలికాం రంగంలోనే సునామిలా దూసుకపోతుంది రిలయన్స్ జియోకు సంబంధించిన 4జీ పీచర్ సెల్ ఫోన్. కాగా ఈ సెల్ ఫోన్ పేలిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది.

టెలికాం రంగంలోనే సునామిలా దూసుకపోతుంది రిలయన్స్ జియోకు సంబంధించిన 4జీ పీచర్ సెల్ ఫోన్. కాగా ఈ సెల్ ఫోన్ పేలిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం చూస్తే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కిషోర్ సింగ్ జియోఫోన్ తన జేబులో పెట్టుకొని పడుకున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కాని ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో బ్యాటరీ పేలడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో కిషోర్ సింగ్ తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనను గమనించిన బంధువులు వెంటనే కిషోర్ సింగ్‌ను దగ్గర్లో ఉన్న సర్కారు దవాఖానకు తరలించిగా ఫలితం మాత్రం దక్కలేదు అప్పటికే కిషోర్ తీవ్రగాయాలతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. చిట్టాగాంగ్‌లోని నెటవల్గార్ పచ్ఛలి ఊరులో ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా మరో వైపు ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకం ద్వారానే జియో సెల్‌ఫోన్ కొనుగొలు చేశామని ఆ గ్రామస్థులు తెలియజేశారు. అయితే ఈ సెల్ ఫోన్ లు చాలా నాసిరకంగా ఉన్నట్లు వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై రిలయన్స్ జియో స్పందించాల్సి ఉంది.

Next Story