హిజ్రాగా మారలేదన్నఆవేదనతో..

హిజ్రాగా మారలేదన్నఆవేదనతో..
x
Highlights

హిజ్రా అంటే ఈ సమాజంలో చిన్న చూపు. చాలా చోట్ల హిజ్రాలు ఆకతాయిలు ఏడ్పించడం కానీ ఇంక కొన్ని చోట్లయితే చావ బాదిన సీన్స్ కూడా చూసే ఉంటారు. కానీ ఓ యువకుడు...

హిజ్రా అంటే ఈ సమాజంలో చిన్న చూపు. చాలా చోట్ల హిజ్రాలు ఆకతాయిలు ఏడ్పించడం కానీ ఇంక కొన్ని చోట్లయితే చావ బాదిన సీన్స్ కూడా చూసే ఉంటారు. కానీ ఓ యువకుడు మాత్రం హిజ్రాగా మారేందుకే సిద్ధమయ్యాడు. అయితే తల్లిదండ్రులు నిరాకరించడంతో తీవ్ర ఆవేదనకులోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే చెన్నైలో విరుగంబాక్కంకు చెందిన మహేంద్రన్‌కు ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. ఎంతో అల్లారుముద్దుగా పెరిగాడు. పేరు పార్థసారథి(21) బీసీఏ చదివాడు. అయితే పార్థసారథి వైఖరిలో ఇటీవల కాలంగా కొంత మార్పు కనిపించింది. ఆడవారికి సంబంధించిన హావ భావాలు, బట్టలు ధరించి తిరుగుతుండే వాడు.హిజ్రాగా మారలేదన్నఆవేదనతో

అయితే పార్థసారథి వైఖరీ చూసి తలిదండ్రులు ఆందోళనకు గురైన అతన్ని గట్టిగా మందలించారు. కాగా అయినప్పటికి పార్థసారథి మాత్రం తన వైఖరీని కొంచెం కూడా మార్చుకొలేదు. కాగా మూడు రోజుల క్రితం ఇంటి నుండి పార్థసారథి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు అతని కోసం అనేక చోట్ల గాలించిన ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా మనలిలో పార్థసారథి హిజ్రాలతో కలిసి ఉన్నట్లు తెలిసింది. అయితే తనకోసం తలిదండ్రులు గాలిస్తునట్లు తెలుసుకున్న పార్థసారథి, ఎలాగైన మళ్లీ తిరిగి ఇంటికి తీసుకెళతారన్న భయంతో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో మనలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories