అమిత్‌ షాకు బెంగాల్‌లో ఘోర అవమానం

అమిత్‌ షాకు బెంగాల్‌లో ఘోర అవమానం
x
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు బెంగాల్లో ఘోర అవమానం జరిగింది. ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అనుమతి నిరాకరించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు బెంగాల్లో ఘోర అవమానం జరిగింది. ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అనుమతి నిరాకరించారు. స్వైన్ ఫ్లూ జ్వరం నుంచి కోలుకున్న అమిత్‌ షా బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ నెల 22న ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో కోల్ కతా వచ్చి అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మాల్దా వెళ్లాలనుకున్నారు. వీవీఐపీ హెలికాప్టర్ మాల్దాలో ల్యాండింగ్‌ కోసం అనుమతించాలని అక్కడి జిల్లా అధికారులకు బీజేపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. తమ పీడబ్ల్యూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం మాల్దా హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ దిగేందుకు అనువుగా లేదని, అక్కడ ఇసుక, నిర్మాణ సామగ్రి ఉన్నాయని జిల్లా అదనపు మేజిస్ట్రేట్ బీజేపీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇక తాత్కాలిక హెలిప్యాడ్‌లో కూడా నిర్మాణ పనులు చేపట్టినందుకు అమిత్ షా హెలికాప్టర్ దిగేందుకు సురక్షితం కాదని, అందుకే తాము హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతించడం లేదని మాల్దా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో బీజేపీ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో అమిత్‌ షా హెలికాప్టర్ మాల్దాలో ల్యాండింగ్‌కు మమత సర్కార్ నిరాకరించింది. అయితే, ల్యాండింగ్‌కు అనువుగా ఉన్నా జిల్లా అధికారులు అనుమతి నిరాకరించడం బీజేపీతో మమతకు ఉన్న వైరుద్యమే కారణమని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories