Top
logo

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు...సీఎంగా...

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు...సీఎంగా...
X
Highlights

బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధినేతి మమతా బెనర్జీ సమీక్షించారు. తాను బెంగాల్‌ సీఎంగా తప్పుకుంటానని...

బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధినేతి మమతా బెనర్జీ సమీక్షించారు. తాను బెంగాల్‌ సీఎంగా తప్పుకుంటానని అయితే టీఎంసీ చీఫ్‌గా మాత్రం కొనసాగుతానని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని పార్టీ గుర్తు ముఖ్యమని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. తాను ఆరు నెలలు పని చేయలేకపోయానని పార్టీకి చెప్పినట్లు ఆమె తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయని అన్నారు. బీజేపీ ఎందుకు అంత ఆకలితో ఉందని మమత ప్రశ్నించారు. ఇతరులకు అవకాశం ఇవ్వరా అని నిలిదీశారు. బెంగాల్ రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్ 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 18 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 2 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది.

Next Story