కేసీఆర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: భట్టి

కేసీఆర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: భట్టి
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం కల్గించేందుకు ఆ పార్టీ నేతలు శ్రీకారం...

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం కల్గించేందుకు ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భద్రాచలంలో ప్రజా స్వామ్య పరిరక్షణ యాత్ర ప్రారంభించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎండగట్టేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు చెబుతున్న భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కల్గించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చేపట్టిన యాత్రను భద్రాచలంలో భట్టి విక్రమార్క ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందుగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్‌పై ఉన్న అభిమానంతో ప్రజలు వారిని ప్రజాప్రతినిధులుగా గెలిపిస్తే గెలిచినవారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆరోపించారు.

అధికార పార్టీ ప్రలోభాలకు గురై ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు భద్రాచలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోడెం వీరయ్య గైర్హాజరయ్యారు. పోడెం వీరయ్య కూడా పార్టీ వీడుతారనడానికి సంకేతంగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories