మల్కాజ్‌గిరి.. మామకు సవాల్‌ !

Highlights

ఎన్నో విశేషాలున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇక ఎవరికి...

ఎన్నో విశేషాలున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇక ఎవరికి వారే తమ వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో వెళుతున్నారు. కాగా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుండి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీనుండి రేవంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. కాగా బీజేపీ పార్టీ నుండి ఎమ్మెల్సీ రామ చంద్‌రావులు బరిలోకి దిగారు. మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు బాధ్యతను మంత్రి మల్లారెడ్డిపైనే మోపింది. నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మల్లారెడ్డి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు పూర్తి చేశారు. మంగళవారం నుంచి విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. మొత్తానికి అల్లుడి గెలుపుకోసం మామ సవాలుగా తీసుకుని ముందుకు వెళుతున్నారు.

కాగా ఇప్పటికే మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. సఫీల్ గూడ మినిట్యాండ్ దగ్గర వాకర్స్ క్లబ్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ కలిసి మద్దతు తెలుపాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ పరిశుద్ద కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్కాజిగిరి మీని భారత్ దేశం అన్ని అతి పెద్ద మల్కాజిగిరి నియోజకవర్గం అన్నారు. ఈ ఎన్నికల్లో ఉప ప్రాంతీయ పార్టీ లకు ఓట్లు వేసిన లభం లేదన్నారు. మొన్నటి వరకు ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. మొత్తానికి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంపై ఉత్కంఠ పోరుసాగుతోంది. మరి ఈ ఎన్నికల రణరంగంలో మల్కాజిగిరిలో ఏ జెండా ఏగరబోతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories