మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఊరిస్తున్న వంటలు..

మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఊరిస్తున్న వంటలు..
x
Highlights

సంక్రాంతి వచ్చిదంటే ప్రతి ఇంటా పిండి వంటలే. పండుగకు వారం ముందే పిండి వంటల హడావుడి మొదలువుతుంది. నలుగురైదుగురు ఇల్లాళ్లు ఒక చోట చేరి అప్పాలు చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఎవరికీ తీరిక ఉండడం లేదు. ఇక పిండి వంటలు చేసే ఓపిక ఎవరికుంటుంది? అందుకే పిండివంటలు కూడా రెడీమేడ్‌గా మారిపోతున్నాయి.

సంక్రాంతి వచ్చిదంటే ప్రతి ఇంటా పిండి వంటలే. పండుగకు వారం ముందే పిండి వంటల హడావుడి మొదలువుతుంది. నలుగురైదుగురు ఇల్లాళ్లు ఒక చోట చేరి అప్పాలు చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఎవరికీ తీరిక ఉండడం లేదు. ఇక పిండి వంటలు చేసే ఓపిక ఎవరికుంటుంది? అందుకే పిండివంటలు కూడా రెడీమేడ్‌గా మారిపోతున్నాయి. అదే స్వీటు అదే తీయదనంతో తయారు చేస్తున్న హోంమేడ్‌ స్వీట్స్‌కి గిరాకి పెరిగింది. మార్కెట్‌ను ముంచెత్తుతున్న సంక్రాంతి హోంమేడ్‌ ఫుడ్‌పై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులే కాదు నోరూరించే పిండివంటలకూ ఈ పండుగ ప్రత్యేకత. మూడ్రోజుల ముచ్చటైన సంక్రాంతి అంటే ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలయ్యేది ఒకప్పుడు. ఊరంతా నెయ్యి వాసనతో గుబాళించేది. పండగ వంటలు చేయడంలో ఊరు ఊరంతా బిజీగా ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా పిండి వంటలు స్వగృహాల్లో కాకుండా స్వీట్స్‌షాపుల్లో హోంమేడ్‌ ఫుడ్‌ దొరుకుతోంది.రెడీమేడ్ డ్రెస్సులు, రెడీమేడ్ నగల్లాగే వీటిని కూడా హోంల్లీ ఫుడ్‌ను రెడీమేడ్‌గా కొనుక్కుని 'సంక్రాంతి' జరుపుకుంటోంది నవతరం.

పల్లెల్లో సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందునుండే రుచికరమైన పిండివంటలు చేయడం మొదలెడుతారు. అరిసెలు ,సకినాలు ,మురుకులు, బొబ్బట్లు, పూర్ణాలతో బిజీగా గడిపేవారు. కానీ నేటి జిజీ లైఫ్‌లో వంట చేసుకునేందుకే తీరిక లేదు ఇక పండగలకు పిండి వంటలు చేసుకునేంత ఓపిక ఎవరికి మాత్రం ఉంటుంది ఈ పాయింటేనే స్వీట్స్‌ షాపులకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కస్టమర్ల టేస్టుకు తగ్గట్లు రుచికరమైన పిండివంటలను స్వయంగా తయారు చేయించడంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పండగ సీజన్ మొదలుకావడంతో చేతినిండా ఆర్డర్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు తయారీదారులు.పండుగకు పిండివంటలు చేసే ఓపిక తీరిక లేక వీటిమీద ఆధారపడుతున్నామని కస్టమర్లంటున్నారు. కస్టమర్లకు నచ్చిన పిండివంటలు అందుబాటులో ఉండటంతో స్వీట్స్‌ షాపులు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. పండుగ స్వీట్స్‌ని ఏ మాత్రం కష్టం లేకుండా ఇంట్లో తయారు చేసినట్లు రుచికరమైన పిండివంటలను ప్రజలకు అందిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఘుమఘుమలాడే అన్నిరకాల సంక్రాంతి పిండివంటలను స్పెషల్‌గా తయారు చేయిస్తున్నామంటున్నారు. దీంతో నోరూరించే సంక్రాంతి పిండివంటలను కొనేందుకు కస్టమర్ల కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారని సంతోష పడుతున్నారు.

మరోవైపు సంక్రాంతి స్పెషల్ ఐటెమ్స్‌ను గిఫ్ట్ ప్యాకులు అందిస్తున్నాయి కొన్ని స్వీట్స్‌ షాపులు. విదేశాల్లోని మిత్రులకు, బంధువులకు కూడా పంపించే ఏర్పాటు చేస్తున్నారు. పండుగ కోసం బారీగా ఆర్డర్లు కూడా వచ్చాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక్కడి వారేకాకుండా విదేశాలనుండి భారీగా ఆర్డర్లు వచ్చాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. గతేడాదికంటే ఈసారి కొనేవారి సంఖ్య రెండితలు పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సంక్రాంతి సంబరాలు ప్రజలకే కాదు వ్యాపారస్తులకు మంచి ఆనందానిస్తున్నాయి. మొత్తానికి ఎలాంటి కష్టం లేకుండా అచ్చం ఇంట్లో తయారు చేసినట్లే హోంమేడ్‌ ఫుడ్‌ అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేస్తూ పండగను మరింత గ్రాండ్‌గా జరుపుకుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories