మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ

మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ
x
Highlights

పశ్చిమ బెంగాల్‌లో దీదీకి షాక్‌ తగిలింది. బీజేపీ తన సత్తా చాటుకుంది. టీఎంసీ సీట్లకు గండి కొట్టింది. కొత్త చరిత్ర సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి...

పశ్చిమ బెంగాల్‌లో దీదీకి షాక్‌ తగిలింది. బీజేపీ తన సత్తా చాటుకుంది. టీఎంసీ సీట్లకు గండి కొట్టింది. కొత్త చరిత్ర సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి పుంజుకుంది. దీంతో మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమబెంగాల్‌లో బిజెపి 18 స్థానాల్లో విజయం సాధించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ బాగా నష్టపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం సీట్లలో 36 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించిన టీఎంసీ, ఈసారి 22 స్థానాలకే పరిమితం అయింది.

ఇక 2014 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బిజెపి , ఏకంగా 16 స్థానాల్లో తన ప్రాబల్యాన్ని చాటుకుంది. దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసిన మోడీ, అమిత్‌ షాలు పశ్చిమబెంగాల్‌పై మరింత ఫోకస్ పెట్టారు. ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేశారు. ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. మమత బెనర్జీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండ గట్టడంలో సక్సెస్ అయ్యారు.

ప్రచారం చివరి రోజుల్లో అమిత్ ర్యాలీ బీజేపీకి ప్లస్‌ అయింది. ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. హింస చెలరేగిన కారణంగా ప్రచారానికి ఒక రోజు ముందే ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ప్రచారం చివరి రోజున మోడీ చేసిన ప్రసంగం బెంగాల్‌ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. బీజేపీ వైపు ఓటర్లను మొగ్గు చూపేలా చేసింది.

పశ్చమబెంగాల్‌లో ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు బీజేపీకి ప్లస్‌గా మారాయి. 39 రోజుల పాటు జరిగిన ఎన్నికలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. బెంగాల్ ప్రజల మైండ్ సెట్‌ను మార్చింది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు మమత ఎలా షాక్‌ ఇచ్చిందో అదే విధంగా మమతకు షాక్‌ ఇవ్వాలని బీజేపీ ప్లాన్‌ చేసింది. ఒక వ్యూహం ప్రకారం ప్రచారం చేసి విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories