పన్ను బాకాయిలను చెల్లించిన మహేష్ బాబు

పన్ను బాకాయిలను చెల్లించిన మహేష్ బాబు
x
Highlights

సినీనటుడు మహేష్ బాబు చెల్లించాల్సిన సర్వీస్ టాక్స్ బాకీ మొత్తం వసూలైంది. జీఎస్టీ కింద కట్టాల్సిన 73 లక్షల పైచిలుకు మొత్తంలో 42 లక్షలను గురువారమే రికవరీ చేయగా, తాజాగా జీఎస్టీ కమిషనరేట్‌ సీజ్‌ చేసిన అకౌంట్‌లోని 31.47లక్షలు కూడా వసూలైంది. మహేస్ బాబు ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న 31.47 లక్షల రూపాయల్ని బ్యాంకు అధికారులు ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు.

సినీనటుడు మహేష్ బాబు చెల్లించాల్సిన సర్వీస్ టాక్స్ బాకీ మొత్తం వసూలైంది. జీఎస్టీ కింద కట్టాల్సిన 73 లక్షల పైచిలుకు మొత్తంలో 42 లక్షలను గురువారమే రికవరీ చేయగా, తాజాగా జీఎస్టీ కమిషనరేట్‌ సీజ్‌ చేసిన అకౌంట్‌లోని 31.47లక్షలు కూడా వసూలైంది. మహేస్ బాబు ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న 31.47 లక్షల రూపాయల్ని బ్యాంకు అధికారులు ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఈ మొత్తాన్ని డీడీ రూపంలో గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచ్‌కు జమ చేసినట్టు జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాలు తెలిపాయి. దీంతో మహేశ్‌బాబు చెల్లించాల్సిన మొత్తం పన్ను జమ అయిందని చెప్పాయి.

బకాయి పడ్డ పన్ను గురించి మహేష్ బాబు చేసుకున్న అప్పీళ్లను రెండు స్థాయిల్లోని అథారిటీలు తిరస్కరించడంతో పాటుగా పన్ను మొత్తాన్ని కట్టాలని ఆదేశించాయని జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలపై మహేష్ బాబు సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించినా..ఇప్పటివరకు న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదని వివరించారు. హైకోర్టు కూడా స్టే ఇవ్వకపోవడంతో తాము చర్యలకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. 2007-08 ఆర్థిక సంవత్సరానికి హీరో మహేష్ బాబు కట్టాల్సిన సర్వీస్ టాక్స్ కు సంబంధించి ఆయనకు 2010లోనే నోటీసులిచ్చామని గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories