రెడ్డి గారి అబ్బాయి అంటున్న మహేష్ ..

రెడ్డి గారి అబ్బాయి అంటున్న మహేష్ ..
x
Highlights

మహర్షి సినిమా తరవాత మహేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది.. ఈ సినిమాని దిల్ రాజు మరియు అనిల్ సుంకర కలిపి నిర్మిస్తున్నారు ....

మహర్షి సినిమా తరవాత మహేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది.. ఈ సినిమాని దిల్ రాజు మరియు అనిల్ సుంకర కలిపి నిర్మిస్తున్నారు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది . అయితే ఈ సినిమాకి ఇదే టైటిల్ అని ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది .

రెడ్డి గారి అబ్బాయి .. అనే టైటిల్ ని దిల్ రాజు ఈ సినిమా కోసం ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో మహేష్ రాయలసీమ కుర్రాడిగా కనిపించబోతున్నారట .. అలాగే అనిల్ కామెడీ టైంమింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా సినిమా తెరకెక్కనుందని సమాచారం .. దీనికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు ..

శ్రీమంతుడు , భరత్ అనే నేను , మహర్షి లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన మహేష్ ఈ సారి మాత్రం పూర్తి యాక్షన్ తో కూడిన కామెడీ సినిమా చేయాలనీ అనుకున్నారట.. అందుకే అనిల్ తో సినిమాకి కమిట్ అయ్యారని సమాచారం . అయితే ఈ సినిమా కుడా దూకుడు లాంటి బ్లాక్ బాస్టర్ మిగులుతుందని మహేష్ ఫాన్స్ ఆశిస్తున్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories