Top
logo

దాడికి పాల్పడిన నింధితుడిని ఉరి తీయాలి

దాడికి పాల్పడిన నింధితుడిని ఉరి తీయాలి
Highlights

హైదరాబాద్ బర్కత్ పురలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బాలికకు 14 నుంచి 15 చోట్ల...

హైదరాబాద్ బర్కత్ పురలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బాలికకు 14 నుంచి 15 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతులు వీపుపై గాయాలయ్యాయి. ఎడమ చేతి చిటికన వేలు పూర్తిగా తెగి పడింది. 48 నుంచి 72 గంటలు గడిస్తే తప్ప బాలిక ఆరోగ్య పరిస్థితి చెప్పలేమంటున్నారు బాలికకు చికిత్స చేస్తున్న యశోదా ఆసుపత్రి వైద్యులు.

తన కూతురుపై దాడికి పాల్పడిన భరత్ ను ఉరి తీయాలని తండ్రి రాములు డిమాండ్ చేశారు. గతంలోనే షీటీం అధికారులు మందలించినప్పటికీ ఇంతటి దారుణానికి ఒడిగడుతాడని అనుకోలేదంటూ బోరున విలపించారు.

బాలికపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డారన్న సమాచారం తెలుసుకున్న అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం బీజేపీ నేత కిషన్ రెడ్డి సహా పలువురు బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. యశోదా ఆసుపత్రి సందర్శించి బాధితురాలికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా దాడి జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన అమ్మాయిలు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడికి పాల్పడిన ప్రేమోన్మాది భరత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


Next Story