logo

టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..

టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..

ఎన్నిక నగారా మోగింది. అభ్యర్థుల్లో అలజడి మొదలైంది. మరో వారంలోనే నామినేషన్ల పర్వం మొదలు కానున్న నేపథ్యంలో ఒక పార్టీ నుండి మరో పార్టీ జంపింగ్ లు కామన్. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో చేరికలతో జోరు మీద ఉన్నాయి ఇరు పార్టీలు. ఈ నేపథ్యంలో తాజాగా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి అధికార పార్టీ టీడీపీ వైపు చూస్తున్నారు. కాగా మదనపల్లి వైపీసీ టికెట్ మైనారిటీ నేతకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్ఠానంపై సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి అసంతృప్తిగా ఉన్నాడు. మదనపల్లి టికెట్‌ను మైనార్టీ నేత నవాజ్ కు ఇచ్చే ఆలోచనలో వైయస్ జగన్ ఉండడంతో పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతున్న తిప్పారెడ్డి. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటున్న తిప్పారెడ్డి అనుచరులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దేశాయ్ తిప్పారెడ్డి మంగళవారం తన అనుచరులతో సమావేశమై తుది భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు. చూడాలి మరి ఈ సమావేశం అనంతరం టీడీపీ గూటికి చేరుతారా లేక వైసీనీ పార్టీలోనే కొనసాగుతారా అనేది సస్పెన్స్. మొత్తాని ఎన్నిక నగారాతో ఏపీలో రాజకీయం మహాయుద్ధన్నే తలపిస్తోంది. ఇక ఇటీవల వైసీపీని వీడిన వంగవీటి రాధా బుధవారం సీఎం నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థంపుచ్చుకోనున్నారు.

లైవ్ టీవి

Share it
Top