logo

సైకిలెక్కేందుకు సిద్దమవుతున్న వైసీపీ ఎమ్మెల్యే..

సైకిలెక్కేందుకు సిద్దమవుతున్న వైసీపీ ఎమ్మెల్యే..

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలోకి జోరుగా వలసల బాట పడుతున్నారు. వలసల బాట పట్టడంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీ తీర్థంపుచ్చుకునేందుకు మరో వైసీపీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లి శాసనసభ్యులు దేశాయి తిప్పారెడ్డి ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. అయితే వైసీపీ పార్టీ దేశాయి తిప్పారెడ్డికి టిక్కెట్ నిరాకరించింది. ఇక ఆ స్థానంలో ఓ మైనారిటీ అభ్యర్థికి టిక్కెట్ ఖారారు చేశారు. ఇక దీంతో దేశాయి తీవ్ర అసంతృప్తికి లోనై టీడీపీ గూటికి చేరే యోచనలో ఉన్నారు దేశాయి తిప్పారెడ్డి. అయితే మదనపల్లిలో టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడంతో దేశాయికి టిక్కెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

లైవ్ టీవి

Share it
Top