ముగిసిన మా ఎన్నిక‌ల పోలింగ్.. అసోసియేషన్ కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రంటే..

ముగిసిన మా ఎన్నిక‌ల పోలింగ్.. అసోసియేషన్ కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రంటే..
x
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడితో పాటు సభ్యుల ఎంపిక కోసం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం...

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడితో పాటు సభ్యుల ఎంపిక కోసం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మొత్తం 745 ఓట్లకు గాను సభ్యులు 472 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షులుగా పోటీ పడుతున్న శివాజీరాజా, నరేష్‌ ఫిలించాంబర్ దగ్గరే మకాం వేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

మరో గంటలో మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండడంతో టాలీవుడ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేది మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం న‌రేష్ వ‌ర్గం గెల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. దానికి తోడు ఇండ‌స్ట్రీ పెద్ద‌ల స‌పోర్ట్ కూడా ఈయ‌న‌కే ఉండ‌టంతో ఈ సారి న‌రేష్ అధ్య‌క్షుడుగా మార‌డం లాంఛ‌న‌మే. రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఇరు ప్యానెళ్ల సభ్యుల పోటీపడి హామీలు గుప్పించారు. మ‌రి చూడాలిక‌.. మొత్తానికి మా ఎన్నిక‌లు ఏం జ‌ర‌గ‌నున్నాయో.. ఎవ‌రు గెల‌వ‌బోతున్నారో..?

Show Full Article
Print Article
Next Story
More Stories