మెట్రో రైలు లిఫ్టులో అసాంఘిక కార్యక్రమాలు

Highlights

ఇందిరాపార్క్‌, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు మొన్నటి వరకు హైదరాబాద్‌లో లవర్స్‌కు అడ్డాలు. మెట్రో వచ్చాక ప్రేమ పక్షలు స్పాట్‌ మార్చాయి. పార్కుల నుంచి...

ఇందిరాపార్క్‌, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు మొన్నటి వరకు హైదరాబాద్‌లో లవర్స్‌కు అడ్డాలు. మెట్రో వచ్చాక ప్రేమ పక్షలు స్పాట్‌ మార్చాయి. పార్కుల నుంచి ఎగిరొచ్చి మెట్రో స్టేషన్స్‌కు చేరుకుంటున్నాయి. వాలంటైన్స్‌ డే కు మరో వారం రోజులు ఉండగానే మెట్రో స్టేషన్స్‌ను రొమాన్స్‌ స్పాట్స్‌గా మార్చేశాయి.

మెట్రో స్టేషన్లలో ఉన్న లిఫ్టులను కూడా లవర్స్‌ వదలడం లేదు. వృద్ధులు, నడవలేని వారి కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లను లిప్‌ లాకింగ్‌‌కు స్పాట్స్‌గా మార్చేశాయి. ప్రేమికులు ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నారు.

మెట్రో రైలు లిఫ్టులో జరిగిన అసాంఘిక కార్యక్రమాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన అధికారులు ఖంగుతిన్నా,రు. వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన మెట్రో రైలు లిఫ్టుల్లో ఇలాంటి అరాచక కార్యక్రమాలు జరుగుతుండడం చూసి నోటిన వేలేసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories