మళ్లీ మొదలైన పెట్రో బాదుడు

మళ్లీ మొదలైన పెట్రో బాదుడు
x
Highlights

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా పట్టించుకోలేదు. రూపాయి విలువ పడిపోయినా లెక్కచేయలేదు.. రోజుకు 150 కోట్ల రూపాయల నష్టం వచ్చినా మౌనంగా ఉన్నాయి....

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా పట్టించుకోలేదు. రూపాయి విలువ పడిపోయినా లెక్కచేయలేదు.. రోజుకు 150 కోట్ల రూపాయల నష్టం వచ్చినా మౌనంగా ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాయి. అంతే మళ్లీ బాదుడు మొదలు పెట్టేశాయి చమురు సంస్థలు. ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. తుది విడత పోలింగ్ ముగియగానే పెట్రోల్ లీటరకు 9 పైసలు, డీజిల్‌పై 15 పైసలు వడ్డించాయి చమురు సంస్థలు. అయితే ఈ బాదుడు ఇంతటితో ఆగదని అంచనా. సుమారుగా 10 నుంచి 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు.

అయితే ఎన్నికలు దగ్గరపడినప్పటి నుంచి ధరలు తగ్గడం మొదలైయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి దిగుమతులను నిలిపివేసినా చమురు సంస్థలు రేట్లు పెంచకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల చమురు సంస్థలు భారీగా నష్టాలు మూటగట్టుకున్నట్టు సమాచారం. ఈ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలోనే ఇప్పుడు బాదుడు ప్రారంభించాయని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే పునరావృతమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories