పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
x
Highlights

కీలకమైన పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది.

కీలకమైన పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. అయితే పౌరసత్వం కల్పించే జాబితాలో హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లను చేర్చి ముస్లింలను వదిలి వేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపనందకు నిరసగా కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల తీరుపై రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్ర‌మ వ‌ల‌స‌దారుల వ‌ల్ల అస్సోం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు త‌మ‌కు తెలుసన్న రాజ్‌నాథ్ పౌర‌స‌త్వ బిల్లుతో ఎవ‌రూ వివ‌క్ష‌కు గురికారని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories