నేడే ఆరో దశ

నేడే ఆరో దశ
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ఆరో దశ పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఆరో...

సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ఆరో దశ పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశలో మొత్తం 979 మంది అభ్యర్థుల పోటీ పడుతుండగా, పదిన్నర కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆరో ఘట్టం ఈరోజు పూర్తికానుంది. 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, మధ్యప్రదేశ్‌లో 8, బీహార్‌లో 8, పశ్చిమబెంగాల్‌లో 8, జార్ఖండ్‌లో 4, ఢిల్లీలో 7 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి.

ఆరో దశలో పలువురు ముఖ్య నేతలతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు బరిలో ఉన్నారు. మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌, బీజేపీ నేతలు నరేంద్రసింగ్‌ తోమర్‌, రిటా బహుగణ జోషి, మేనకా గాంధీ, రాధా మోహన్‌ సింగ్‌, సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌, కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌, షీలా దీక్షిత్‌, జ్యోతిరాదిత్య సింధియా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, భోజ్‌పురి నటుడు దినేల్‌ లాల్‌ యాదవ్‌ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

నాలుగైదు విడతల్లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 770 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన దేశ రాజధానిలో 60వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఒక్క ఢిల్లీలోనే 47 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు 66 కంపెనీల ఢిల్లీ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories