ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌‌పై కేసీఆర్ క్యాంప్‌ విశ్లేషణ..!

ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌‌పై కేసీఆర్ క్యాంప్‌ విశ్లేషణ..!
x
Highlights

ఎగ్జిట్‌ పోల్ రిజల్ట్స్‌పై గులాబీ పార్టీ ఏమనుకుంటోంది? దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై ఎలా విశ్లేషిస్తోంది? కాంగ్రెస్‌, బీజేపీ...

ఎగ్జిట్‌ పోల్ రిజల్ట్స్‌పై గులాబీ పార్టీ ఏమనుకుంటోంది? దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై ఎలా విశ్లేషిస్తోంది? కాంగ్రెస్‌, బీజేపీ పెర్ఫ్మామెన్స్‌పై టీఆర్‌ఎస్ లీడర్స్ మాటేంటి? దేశ రాజకీయాలను మలుపుతిప్పే రాష్ట్రాలేవని కేసీఆర్ క్యాంప్ భావిస్తోంది? ఎక్స్‌క్లూజివ్ స్టోరీ ఆన్ HMTV

ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌ తర్వాత దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై గులాబీ పార్టీ కన్నేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పెర్ఫ్మామెన్స్‌పై విశ్లేషణ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో మహాకూటమి కట్టిన పార్టీలు ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని అంచనాకి వచ్చింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో మహాకూటమిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే రీసెంట్‌గా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో హస్తం పార్టీ సాధించబోయే ఫలితాలపైనే ఢిల్లీ పీఠం ఎవరిదో తేలనుందని, జాతీయ రాజకీయాలను మలుపుతిప్పే అసలుసిసలు రిజల్ట్స్‌ ఇక్కడే రానున్నాయని, ఈ మూడు రాష్ట్రాల్లోని ఫలితాలే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతాయని గులాబీ నేతలు లెక్కగడుతున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40 నుంచి 60శాతం సీట్లు సాధించలేకపోతే ఘోరంగా విఫలమైనట్లేనని, మంచి అవకాశం చేజారినట్లేనని విశ్లేషిస్తున్నారు. చివరికి కర్నాటక, మహారాష్ట్రలో అలయన్స్‌లను ముందుకు తీసుకెళ్లడంతో కాంగ్రెస్‌ విఫలమైందని, అలాగే పశ్చిమబెంగాల్‌, ఒడిషాల్లో కూడా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయిందని భావిస్తోన్న గులాబీ నేతలు ఈ పరిణామాలన్నీ మరోసారి బీజేపీకి కలిసి రానున్నాయని అంచనా వేస్తున్నారు.

ఓవరాల్‌గా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌పై కేసీఆర్ క్యాంప్ విస్తృత విశ్లేషణలు జరుపుతోంది. వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిశీలిస్తున్నారు. అయితే, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్‌ 100 నుంచి 120 సీట్లు సాధిస్తే, ఫెడరల్ ఫ్రంట్ మద్దతును హస్తం పార్టీకి ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా అన్ని సీట్లు సాధిస్తుందా? లేదో? చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories