ఒక్కరోజు లీవ్‌ పెడితే.. 4 రోజులు సెలవులు

ఒక్కరోజు లీవ్‌ పెడితే.. 4 రోజులు సెలవులు
x
Highlights

ఒక్కరోజు లీవ్‌ పెడితే 4 రోజులు సెలవులు వచ్చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ డే కావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు ఇచ్చింది. ఇక 12వ తేదీ ఒక్కరోజు సెలవు...

ఒక్కరోజు లీవ్‌ పెడితే 4 రోజులు సెలవులు వచ్చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ డే కావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు ఇచ్చింది. ఇక 12వ తేదీ ఒక్కరోజు సెలవు పెడితే మరో రెండు రోజులు అంటే 13,14 తేదీలు రెండో శనివారం, ఆదివారం రావడంతో వరుస సెలవులు వచ్చిపడ్డాయి. దీంతో ఓటేయకుండా జనం ఊరెల్లిపోతారేమోనన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.

వరుస సెలవుల భయం అభ్యర్థులను వెంటాడుతోంది. ఈ నెల 11న పోలింగ్ రోజు కావడంతో ప్రభుత్వం స్పెషల్ లీవ్ ఇచ్చింది. ఆ తర్వాత 12వ తేదీ వర్కింగ్ డే, తర్వాత 2రోజులు అంటే రెండో శనివారం, ఆదివారం సెలవులు వచ్చాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు కార్యాలయాలకు శుక్రవారం సెలవు పెడితే నాలుగు రోజులు సెలవులే సెలవులు. అసలే ఎండలు మండుతుండటంతో ఈ నాలుగు రోజుల సెలవుల్లో ఊటీకో, కొడైకెనాల్‌కో వేసవి ట్రిప్‌కు వెళ్తారేమోనని అభ్యర్థులు అందోళన చెందుతున్నారు.

అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇదే జరిగింది. డిసెంబరు 7న పోలింగ్ జరగ్గా ఆ రోజు శుక్రవారం వచ్చింది. తర్వాత రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులొచ్చాయి. దీంతో 3 రోజుల సెలవులను జాలీ డేస్‌గా వినియోగించుకున్నారు ఉద్యోగులు. రాష్ట్రవ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్‌ నమోదు కాగా, హైదరాబాద్‌లో 50 శాతం కూడా నమోదు కాలేదు. ఉద్యోగుల్లో చాలా మంది టూర్లకు వెళ్లడమే పోలింగ్‌ తక్కువగా నమోదు కావటానికి కారణమని రాజకీయ పార్టీలు గుర్తించాయి. నగరంలో 40 శాతానికి పైగా జనం వేరే ప్రాంతాలకు చెందినవారు కావడంతో సెలవులకు ఇలాంటప్పుడు ఊరెళ్లడం పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈసారి కూడా వచ్చిన వరుస సెలవులు పోలింగ్‌పై ప్రభావం చూపుతాయేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రచారంలో ఈ అంశాన్ని కూడా ఉటంకిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. 11న ఓటు హక్కును వినియోగించుకున్నాక ఊళ్లకు వెళ్లాలని, ఓటు వేయకుండా వెళ్లొద్దంటూ వేడుకుంటున్నారు అభ్యర్థులు. మరి ఈ సెలవుల ఎఫెక్ట్ అభ్యర్థులపై ఎంత వరకు ఉంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories