ఓటేసిన ప్రముఖులు.. 2 వరకు 38.63% పోలింగ్ నమోదు

ఓటేసిన ప్రముఖులు.. 2 వరకు 38.63% పోలింగ్ నమోదు
x
Highlights

నాలుగో విడత పోలింగ్ కొన్నిచోట్ల ఘర్షణ మినహా అంతటా ప్రశాతంగా కొనసాగుతోంది. 8 రాష్ట్రాల పరిధిలోని 71 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు , జమ్ముకశ్మీర్‌లోని...

నాలుగో విడత పోలింగ్ కొన్నిచోట్ల ఘర్షణ మినహా అంతటా ప్రశాతంగా కొనసాగుతోంది. 8 రాష్ట్రాల పరిధిలోని 71 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు , జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్ నియోజకవర్గంలో రెండో విడత పోలింగ్‌‌ జరుగుతోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్ధాన్‌‌లలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల దగ్గరకు చేరుకున్నారు. పలు చోట్ల వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 వరకు 38.63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

పోలింగ్ ప్రారంభం కాగానే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబైలో ఓటు వేశారు. రాజ్యసభ సభ్యురాలు రేఖ ముంబైలో, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి జైపూర్‌లో, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్‌ సింగ్‌, రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా, బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ, ఇంటర్నేషనల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, సీపీఐ బెగుసరయ్‌ ఎంపీ అభ్యర్థి, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌, సినీ నటి ఉర్మిళ మతోండ్కర్‌, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ పరేశ్‌ రావల్‌ దంపతులు, బీజేపీ మధుర ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆమె కూతుర్లు ఈషా డియోల్‌తో పాటు తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‌‌

Show Full Article
Print Article
Next Story
More Stories