తెలంగాణలో ముగిసిన తొలివిడత స్థానిక ఎన్నికల పోలింగ్

తెలంగాణలో ముగిసిన తొలివిడత స్థానిక ఎన్నికల పోలింగ్
x
Highlights

తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 2096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు....

తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 2096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఎంపీటీసీ కోసం గులాబీ, జడ్పీటీసీ కోసం తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలను వినియోగించారు. వేసవి తీవ్ర దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరినప్పటికీ ఎండ వేడిమితో మధ్యాహ్నానికి పోలింగ్‌ కాస్త మందకొడిగా సాగింది. సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి ఓటర్లు మరింతగా తరలివచ్చారు. దీంతో పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వేసే అవకాశం కల్పించారు.

అయితే, కొన్ని చోట్ల అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్‌ పత్రాలు సరిపోలేదు. మరికొన్ని చోట్ల తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఓటు వేయబోమంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్‌, తెరాస మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ముగిసింది. 217 ఎంపీటీసీ స్థానాలకు సాయంత్రం 4గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. కొమ్రంభీం ఆసిఫాబాద్‌లో ఆరు గ్రామాలు, మంచిర్యాల జిల్లాలో 7గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7గ్రామాలతో పాటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాలో రెండు గ్రామాల్లో పోలింగ్‌ ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories